संस्कृतज्ञो भव - Learn Sanskrit in Telugu

संस्कृतज्ञो भव - Learn Sanskrit

This page is completely dedicated to learn Sanskrit. Sanskrit for Daily Use. Sanskrit will by taught by Sri Meduri Suryanarayana, a renowned Sanskrit Scholar who has Doctorate in the subject and also a Veda Pandit. The page contains Sanskrit Words for daily use. Learn Sanskrit in Telugu. Learn Daily Use Sanskrit in Telugu


ఈ పేజి సంస్కృత ప్రాథమిక అంశములు నేర్చుకొనుటకు నిర్దేశించినది. రోజువారీ వాడుకకు గాను సంస్కృతమును నేర్చుకొనుటకు నిర్దేశించినది. సంస్కృతం లో నిష్ణాతులు, డాక్టరేట్ పొందిన వారు, వేద పండితులు అయిన బ్రహ్మశ్రీ మేడురి సూర్యనారాయణ గారు బోధిస్తారు. ప్రతి వారం రెండు రోజులు మాత్రమే పోస్ట్ చేయబడుతుంది. సందేహాలుంటే నేరుగా మమ్ములను సంప్రదించ వచ్చును.

 

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా –

న స్నానం న విలేపనం న కుసుమం నాఽలన్కృతా మూర్ధజాః |

వా ణ్యేకా సమలజ్ఞ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే –

క్షీయన్తేఽఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ||


केयूराणि न भूषयन्ति पुरुषं होरा न चन्द्रोज्ज्वला –

न स्नानं न विलेपनं न कुसुमं नालज्ञ्कृता मूर्धजाः |

वा ण्येका समलज्ञ्करोति पुरुषं या संस्कृता धार्यते –

क्षीयन्तेఽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् ||   डा. मेडुरी सूर्यनारायण 

image41

संस्कृतज्ञो भव - Learn Sanskrit in Telugu

संस्कृतज्ञो भव - Learn Sanskrit

This page is completely dedicated to learn Sanskrit. Sanskrit for Daily Use. Sanskrit will by taught by Sri Meduri Suryanarayana, a renowned Sanskrit Scholar who has Doctorate in the subject and also a Veda Pandit. The page contains Sanskrit Words for daily use. Learn Sanskrit in Telugu. Learn Daily Use Sanskrit in Telugu


ఈ పేజి సంస్కృత ప్రాథమిక అంశములు నేర్చుకొనుటకు నిర్దేశించినది. రోజువారీ వాడుకకు గాను సంస్కృతమును నేర్చుకొనుటకు నిర్దేశించినది. సంస్కృతం లో నిష్ణాతులు, డాక్టరేట్ పొందిన వారు, వేద పండితులు అయిన బ్రహ్మశ్రీ మేడురి సూర్యనారాయణ గారు బోధిస్తారు. ప్రతి వారం రెండు రోజులు మాత్రమే పోస్ట్ చేయబడుతుంది. సందేహాలుంటే నేరుగా మమ్ములను సంప్రదించ వచ్చును.

  

ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

సంస్కృతజ్ఞో భవ


अङ्कः - ००१

దినాంకః - 09.11.19 

స్థిరవాసరః - శనివాసరః 

అద్యతన సంస్కృత పాఠః - ఈనాటి సంస్కృత పాఠము 

1. హరిః ఓమ్ - హలో 

2. భోః - అయ్యా 

3. ప్రణామః - నమస్కారము

4. అభివాదయే - నమస్కరిస్తున్నాను

5. అహం - నేను

6. సుప్రభాతం / శుభోదయం - Good Morning 

7. శుభరాత్రిః - Good Night 

8. ధన్యవాదః - కృతజ్ఞత

9. క్షమ్యతాం - క్షమించండి

10. చింతామాస్తు - ఫర్వాలేదు.


अङ्कः - ००२

దినాంకః - 10.11.19 

భానువాసరః - ఆదివారం

అద్యతన సంస్కృత పాఠః - ఈనాటి సంస్కృత పాఠము

1. సమీచీనం - బాగుంది

2. బహు సమీచీనం - చాలా బాగుంది. 

3. అస్తి - ఉన్నది \ ఉన్నాడు

4. నాస్తి - లేదు / లేడు

5. అస్తి వా ? - ఉన్నదా / ఉన్నాడా? 

6. నాస్తి వా ? - లేదా \ లేడా? 

7. అస్తు - సరే 

8. మాస్తు - వద్దు

9. అలం / పర్యాప్తమ్ - చాలు

10. తథైవ - అలాగే, ఆ ప్రకారంగానే.


अङ्कः - ००३

దినాంకః - 16.11.19 

స్థిరవాసరః 

1. ఆమ్ - అవును

2. న - కాదు

3. ఉత్తమం - బాగుంది 

4. అత్యుత్తమం / బహు ఉత్తమం - చాలా బాగుంది

5. అనుత్తమం - బాగా లేదు 

6. ఉత్తమం నాస్తి – బాగా లేదు. 

7. సమ్యగస్తి - బాగుంది 

8. సమ్యగేవ అస్తి - బాగానే ఉంది 

9. సమ్యక్ నాస్తి – బాగా లేదు.‌

10. సాధు - ఉత్తమం, బాగుంది.


अङ्कः - ००४

దినాంకః - 17.11.19

భానువాసరః 

1. అంతః - లోపల 

2. బహిః - బయట

3. పురతః - ముందు

4. పృష్టతః - వెనుక

5. సకాశే / సమీపే - దగ్గర

6. పార్శ్వే - ప్రక్కన

7. కోణే - మూలన 

8. ఉపరి - పైన 

9. అధః - క్రింద 

10. దూరే – దూరంగా


अङ्कः - ००५

దినాంకః - २३.११.१९, 23.11.19 

వాసరః - స్థిరవాసరః 

సంస్కృత పాఠః 

1. సమీపే - దగ్గర 

2. వామతః – ఎడమ వైపు

3. దక్షిణతః – కుడి వైపు 

4. వామ హస్తం - ఎడమ చేయి

5. దక్షిణ హస్తం - కుడి చేయి 

6. తథైవ భవతు - అలాగే కానిమ్ము 

7. ఇతోsపి - ఇంకా 

8. అధికతయా - ఎక్కువగా, అధికం - ఎక్కువ

9. స్వల్పతయా - తక్కువగా, అల్పం, స్వల్పం, న్యూనం - తక్కువ

10. స్వీకుర్వంతు - తీసుకోండి

11. స్వీకరోతు - తీసుకో 

12. న స్వీకుర్వంతు - తీసుకోకండి

13. న స్వీకరోతు - తీసుకోకు

14. దదాతు - ఇవ్వండి, ఇవ్వు

15. న దదాతు - ఇవ్వకండి, ఇవ్వకు.


अङ्कः - ००६

దినాంకః - २४.११.१९ , 24.11.19 

వాసరః - భానువాసరః 

సంస్కృత పాఠః 

1. త్వం - నీవు 

2. భవాన్ - నీవు / మీరు (పుం)

3. భవతీ - నీవు / మీరు (స్త్రీ) 

4. యూయం - మీరు 

5. సః - అతడు/ వాడు 

6. ఏషః - ఇతడు/ వీడు

7. సా - ఆమె 

8. ఏషా - ఈమె 

9. కః - ఎవరు (పుం) 

10. కా - ఎవరు (స్త్రీ) 

11. అస్మదీయః - మావాడు 

12. అన్యః - ఇతరులు

13. భవదీయః - మీ వాడు

14. భవతః - నీ యొక్క / మీ (పుం) 

15. భవత్యాః - నీ యొక్క / మీ యొక్క (స్త్రీ) 


अङ्कः - ००७

దినాంకః - ३०.११.१९ 30.11.19

వాసరః - స్థిరవాసరః 

1. కస్య - ఎవరియొక్క (పుం)

2. కస్యాః - ఎవరి యొక్క (స్త్రీ) 

3. తస్య - అతనియొక్క 

4. ఏతస్య - ఇతని యొక్క 

5. తస్యాః - ఆమె యొక్క 

6. ఏతస్యాః - ఈమె యొక్క 

7. మమ - నా యొక్క 

8. మహ్యం - నా కోసం 

9. మదర్థం - నా కోసం

10. అస్మదర్థం - మా కోసం

11. కిమర్థం - ఎందుకు ? 

12. తదర్థం - అందుకోసం 

13. ఏతదర్థం - ఇందుకోసం 

14. ఇదానీం / అధునా - ఇప్పుడు 

15. తదానీం - అప్పుడు 

16. కదా ? - ఎప్పుడు ?


 अङ्कः - ००८ 

దినాంకః - ०१.१२.१९  01.12.19 

భానువాసరః - సంస్కృత పాఠః 

1. ఇదానీంతన - ఇప్పటి

2. అద్యతన - ఈనాటి, ఈరోజున 

3. తదానీంతన - అప్పటి 

4. కదా ? - ఎప్పుడు ? 

5. ఇదానీం - ఇప్పుడు

6. తదానీం - అప్పుడు 

7. యదా - ఎప్పుడైతే 

8. తదా - అప్పుడు 

9. అద్య - ఈరోజు

10. హ్యః - నిన్న 

11. పరహ్యః - మొన్న 

12. ప్రపరహ్యః - అవతలి  మొన్న 

13. శ్వః - రేపు 

14. పరశ్వః - ఎల్లుండి 

15. ప్రపరశ్వః - అవతలి ఎల్లుండి 

16. పూర్వం/ పురా - ఒకప్పుడు


 

अङ्कः - ००९

దినాంకః - ०७.१२.२०१९ 07.12.19 

వాసరః - స్థిరవాసరః 

1. కిం? - ఏమిటి ? 

2. కీదృశం - ఎటువంటి ? 

3. యాదృశం - ఎటువంటిదో 

4. తాదృశం - అటువంటిది 

5. కియత్ - ఎంత ? 

6. కతి ? - ఎన్ని 

7. కతిచిన - కొన్ని 

8. కశ్చిత్ -  ఒకానొక

9. ఏకదా - ఒకప్పుడు 

10. సర్వదా - ఎల్లప్పుడు

11. బహుధా - చాలాసార్లు 

12. ఏకవారం - ఒకసారి 

13. బహువారం - చాలాసార్లు

14. వారం వారం - మరల మరల 

15. పునః పునః , ముహుర్ముహుః - మళ్ళీ మళ్ళీ 

16. కతి వారం - ఎన్నిసార్లు


 

अङ्कः ०१०

దినాంకః - ०८.१२.१९ 08.12.19 

వాసరః - భానువాసరః - సంస్కృత పాఠః 

1. దినే - రోజున 

2. సప్తాహే - వారంలో 

3. పక్షే - 15 రోజుల్లో 

4. మాసే - నెలలో 

5. మాసద్వయే - రెండు నెలల్లో 

6. మాసత్రయే - మూడు నెలల్లో 

7. సంవత్సరే, వర్షే - సంవత్సరంలో 

8. ఆగామి - రాబోయే 

9. తః, ప్రభృతి - నుంచి 

10. పర్యంతం - వరకు 

11. ప్రాతః - ఉదయకాలంలో 

12. మధ్యాహ్నే - మధ్యాహ్న సమయంలో 

13. సాయంకాలే / సాయం సమయే - సాయంత్రం వేళలో 

14. రాత్రౌ - రాత్రి యందు

15. అర్థరాత్రౌ - అర్థరాత్రి యందు. 

16. అహోరాత్రం - రాత్రింబగళ్ళు 

  

అజ్ఞ్కః ౦౧౧

దినాంకః - १५.१२.१९ 14.12.19 

సంస్కృత పాఠః 

సమయః - సమయం 

1. వాదనే - గంటలకు 

2. ఏక వాదనం - ఒక గంట 

3. ద్వి వాదనం - రెండు గంటలు 

4. త్రి వాదనం - మూడు గంటలు 

5. చతుర్వాదనం - నాలుగు గంటలు 

6. పంచ వాదనం - ఐదు గంటలు 

7. షడ్వాదనం - ఆరు గంటలు

8. సప్త వాదనం - ఏడు గంటలు 

9. అష్ట వాదనం - ఎనిమిది గంటలు 

10. నవ వాదనం - తొమ్మిది గంటలు

11. దశ వాదనం - పది గంటలు 

12. ఏకాదశ వాదనం - 11 గంటలకు 

13. ద్వాదశ వాదనం - పన్నెండు గంటలు


అజ్ఞ్కః ౦౧౨

సంస్కృత పాఠః - దినాంకః ,

१५.१२.१९ , 15.12.19

ఇప్పుడు మనం ఒక గంట నుండి మరొక గంట మధ్య ఉండే వ్యత్యాసం తెలుసుకుందాం. ఉదాహరణకు - 2 గం. నుండి 3 గంటల మధ్య సమయం. 

ద్వివాదనం - 2.00 

పంచాధిక ద్వివాదనం - 2.05

దశాధిక ద్వివాదనం - 2.10 

సపాద ద్వివాదనం - 2.15 

సార్ధ ద్వివాదనం - 2.30 

చత్వారింశత్యధిక ద్వివాదనం - 2.40

పాదోన త్రివాదనం - 2.45 

దశోన త్రివాదనం - 2.50 

పంచోన త్రివాదనం - 2.55 

త్రివాదనం - 3.00

పైన తెలిపిన విధంగా సభ్యులు సమయసారిణిని (Time Table) ని సాధన చేయగలరు. జనవరి నెల నుంచి సంస్కృత లిపిలో కూడా పాఠం అందుబాటులోకి రాగలదని ఆశిస్తున్నాను.


అజ్ఞ్కః ౦౧౩

15.12.19 నాటి మరొక పాఠం 

ఏకం - 1 

ద్వే - 2 

త్రీణి - 3 

చత్వారి - 4 

పంచ - 5

షట్ - 6 

సప్త - 7 

అష్ట - 8

నవ - 9 

దశ - 10 

ఏకాదశ - 11 

ద్వాదశ - 12 

త్రయోదశ - 13 

చతుర్దశ - 14

పంచదశ - 15 

షోడశ - 16 

సప్తదశ - 17

అష్టాదశ - 18 

నవదశ / ఏకోనవింశతిః - 19 

వింశతిః - 20 

  

అజ్ఞ్కః ౦౧౪

దినాంకః - 21.12.19

२१.१२.१९ 

సంస్కృత పాఠః 

ఏకవింశతిః - 21 

ద్వావింశతిః - 22 

త్రయో వింశతిః - 23 

చతుర్వింశతిః - 24 

పంచవింశతిః - 25 

షడ్వింశతిః - 26 

సప్తవింశతిః - 27

అష్టవింశతిః - 28

ఏకోనత్రింశత్ - 29

త్రింశత్ - 30 

ఏకత్రింశత్ - 31 

ద్వా త్రింశత్ - 32 

త్రయస్త్రింశత్ - 33

చతుస్త్రింశత్ - 34 

పంచత్రింశత్ – 35

షట్ త్రింశత్ - 36

సప్త త్రింశత్ - 37

అష్ట త్రింశత్ - 38 

ఏకోనచత్వారింశత్ - 39

చత్వారింశత్ - 40

సప్త త్రింశత్ - 39

ఏకోన చత్వారింశత్ - 40 

ఏక చత్వారింశత్ - 41 

ద్వా చత్వారింశత్ - 42

త్రయశ్చత్వారింశత్ - 43

చతుశ్చత్వారింశత్ - 44 

పంచ చత్వారింశత్ - 45

షట్ చత్వారింశత్ - 46

సప్త చత్వారింశత్ - 47

అష్ట చత్వారింశత్ - 48 

ఏకోన పంచాశత్ - 49 

పంచాశత్ – 50


1. కుత్ర - ఎక్కడ? 

2. అత్ర - ఇక్కడ 

3. తత్ర - అక్కడ 

4. అన్యత్ర - మరొకచోట 

5. సర్వత్ర - అంతట 

6. ఇహ - ఈ, ఇప్పుడు 

7. యత్ర యత్ర - ఎక్కడెక్కడైతే 

8. తత్ర తత్ర - అక్కడక్కడ 

9. యతః - ఎందువలననగా 

10. తతః - అక్కడినుంచి 

11. కుతః - ఎక్కడినుండి 

12. ఏకదా - ఒకప్పుడు 

13. కదాచిత్ - ఎప్పుడో ఒకప్పుడు 

14. కశ్చిత్ - ఒకానొక 

15. కేచన – కొంతమంది


అజ్ఞ్కః ౦౧౫

దినాంకః - 22.12.19 , २२.१२.१९ 

1. బాలకః - అబ్బాయి 

2. బాలికా - అమ్మాయి 

3. యువకః - యువకుడు 

4. యువతిః - యువతి 

5. పురుషః - పురుషుడు/ మగవాడు 

6. మహిళా - స్త్రీ 

7. వృద్ధః - వృద్ధుడు 

8. వృద్ధా - వృద్ధురాలు 

9. సూర్యః - సూర్యుడు 

10. చంద్రః - చంద్రుడు 

11. ఖగాః - పక్షులు 

12. మేఘః - మేఘము 

13. పర్వతః, గిరిః - కొండ

14. సరితా/వారి/జలం - నీరు

15. నౌకా - పడవ

16. వృక్షః - చెట్టు 

17. చిక్రోడః - ఉడుత

18. ఘాసః - గడ్డి

19. మృగః - జింక

20. హరిణః - లేడి 

21. శశః - కుందేలు

22. చటకః - పిచ్చుక 

23. శుకః - కోయిల

24. మూషకః - ఎలుక 

25. శునకః - కుక్క 

26. బకః - బాతు 

27. హంసః - హంస 

28. గజః/హస్తి - ఏనుగు 

29. శ్రీః - సాలె పురుగు

30. కాళః, సర్పః – పాము


అజ్ఞ్కః ౦౧౬

దినాంకః - 28.12.19, २८.१२.१९ 

సంస్కృత పాఠం 

1. గజః / హస్తి - ఏనుగు 

2. వానరః - కోతి 

3. సింహః - సింహము 

4. వ్యాఘ్రః - పులి

5. ఉష్ట్రః - ఒంటె 

6. అశ్వః – గుఱ్ఱం (బండి ర పెట్టుకోవలెను) 

7. భల్లూకః - ఎలుగుబంటి 

8. గర్దభః - గాడిద

9. అజా - మేక 

10. ధేనుః - ఆవు 

11. గౌః - ఎద్దు 

12. శునకః - కుక్క 

13. బిడాలః, మార్జాలః - పిల్లి 


అజ్ఞ్కః ౦౧౭

దినాంకః - 29.12.19 २९.१२.१९ 

సంస్కృత పాఠః 

1. ఏవ - ఏ (నిశ్చయము, నువ్వే, అదియే అను సందర్భంలో) 

2. న - లేదు, కాదు

3. శనైః శనైః - నెమ్మది నెమ్మదిగా 

4. శీఘ్రం, తీవ్రం - వేగంగా, త్వరగా 

5. ప్రతి - వైపు 

6. తూష్ణీం - ఊరకనే 

7. మా కురు - చేయవద్దు 

8. పరస్పరం - ఒకరికొకరు 

9. ఏవం - ఈ విధంగా 

10. యథా - ఏ విధంగా అయితే, ఎలాగైతే

11. తథా - ఆ విధంగా 

12. కిం - ఏమిటి (నపు) 

13. కా - ఎవరు (స్త్రీ)

14. కః - ఎవరు, ఏమిటి (పుం)

15. కతి - ఎన్ని? 

16. కీదృశం - ఎటువంటి? 

17. కిమర్థం - ఎందుకు? 

18. కియత్ - ఎంత? 

19. కుతః - ఎక్కడినుండి 

20. కదా - ఎప్పుడు 

21. యదా - ఎప్పుడైతే 

22. తదా - అప్పుడు 

23. కుత్ర - ఎక్కడ 

24. అత్ర - ఇక్కడ 

25. తత్ర - అక్కడ

26. అన్యత్ర - మరొకచోట 

27. సర్వత్ర - అంతట 

24. కధం - ఎలా? 

25. ఇతః - ఇక్కడినుండి 

26. తతః - అక్కడినుంచి 

27. ఇతస్తతః - ఈవైపు నుంచి ఆ వైపుకి 

28. సర్వథా - అన్ని విధముల 

29. కదాచిత్ - ఎప్పుడో ఒకప్పుడు 

30. అపి, చ - కూడా


అజ్ఞ్కః ౦౧౮

దినాంకః - 04.02.2020  ०४.०२.२०२० 

వస్తూని - వస్తువులు 

వ్యజనమ్ - Fan 

దర్పణః -  అద్దం 

దీపకః - దీపపు కుందె 

చిత్రమ్ -  ఫొటో 

ద్వారం - తలుపు 

పు‌స్తకం - పుస్తకము 

లేఖనీ - Pen 

చమసః - చెంచా 

పాత్రం - గిన్నె

ఘటః - కుండ 

పాదత్రాణమ్ - చెప్పులు 

ఘటీయంత్రం - గడియారం 

భూషణం, ఆభరణం - నగ 

మంచః - మంచము / సింహాసనము 

విద్యుద్దీపః - బల్బు 

దండ దీపః - Tube Light 

కరదీపః - Torch Light 

మండపః - మండపము

కంకతమ్ - దువ్వెన 

సీవన యంత్రం - కుట్టు మిషను 

వాతాయనం - కిటికీ

జవనికా - తెర

యాన పేటికా - సూట్ కేస్ 

నిధానికా - అలమర 

దూరవాణి - Land Line 

పుష్పధానీ - Flower vase 

ద్వి చక్రికా - సైకిల్ 

కర్తరీ - కత్తెర


అజ్ఞ్కః ౦౧౯

సంస్కృత పాఠః  

దినాంకః - 05.01.2020 

బంధుత్వాలు 

1. మాతా - తల్లి 

2. పితా - తండ్రి 

3. దౌహిత్రః - మనుమడు (కూతురి కొడుకు) 

4. దౌహిత్రీ - మనుమరాలు 

(కుమార్తె కూతురు) 

5. అగ్రజః - అన్న 

6. అనుజః / భ్రాతా / సోదరః - తమ్ముడు 

7. శ్వశురః - మామగారు 

8. జామాతా - అల్లుడు 

9. భ్రాతృజా - సోదరుని కుమార్తె 

10. భాగినేయీ - సోదరి కుమార్తె 

11. జ్యేష్ఠః - పెద్ద 

12. కుటుంబః - కుటుంబం 

13. పితామహః - తాత (నాన్నకి నాన్న) 

14. పితామహీ - నాయనమ్మ 

15. మాతామహః - తాతయ్య (అమ్మకి తండ్రి) 

16. మాతామహీ - అమ్మమ్మ 

17. పితృవ్యః - పినతండ్రి 

18. మాతులః - మేనమామ 

19. మాతులానీ - మేనత్త 

20. పుత్రః - కొడుకు 

21. పుత్రీ / పుత్రికా - కూతురు 

22. భగినీ - సోదరి 

23. అగ్రజా -అక్క 

24. అనుజా - చెల్లి 

25. శ్వశ్రూః - అత్తగారు 

26. భ్రాతృజః - సోదరుని కుమారుడు 

27. భాగినేయః -  మేనల్లుడు 

28. భ్రాతృజాయా - వదిన 

29. పౌత్రః - కొడుకు కొడుకు 

30. పౌత్రీ - కొడుకు కుమార్తె

31. స్నుషా - జామి - కోడలు

डा. मेडुरी सूर्यनारायण

image42