Quote of the Day

Sanskrit Lokokti

(Sanskrit Lokokti or Dictum - Quote of the Day - Inspirational Quotes)


న చోర హార్యం న చ రాజ హార్యం న భ్రాతృభాజ్యం న చ భార కారి |

వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వ ధనం ప్రధానం ||


న చోర హార్యం - చోరులు తస్కరించ లేనిది, న చ రాజ హార్యం రాజులు మన వద్దనుండి లాక్కునే అవకాశం లేనిది, న భ్రాతృభాజ్యం భ్రాతలు (అనగా అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు) మన వద్ద నుండి పంచుకోలేనిది, న చ భార కారి భుజస్కందాలపై బరువు లేనిది, వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం ఎంతగా ఖర్చు చేస్తుంటే అంతగా వృద్ధి చెందునది విద్యా మరియు జ్ఞాన ధనం మాత్రమే. విద్యాధనం సర్వ ధనం ప్రధానం ఇట్టి విద్యా మరియు జ్ఞాన ధనం అన్ని ధనానలకంటే కూడా ప్రధానమైనది.

ఇట్టి విద్యను, జ్ఞానాన్ని నిస్స్వార్థంగా ఇతరులకు పంచేవారు మహానుభావులు.


17.09.2019


Quote of the Day


What you do not want done to yourself, do not do to others.........Confucius


ఏదైతే మీకు జరగ కూడదని భావిస్తారో; అదే ఇతరులకు కూడా చేయరాదు లేదా జరగరాదు......కన్ఫ్యూషియస్


మనకు మాత్రం ఎలాంటి చెడు జరగకూడదు, కాని ఇతరులకు చెడు జరగాలనే భావన సరియైనది కాదు. మనకంతా మంచే జరగాలని ప్రతి ఒక్కడూ ఆశిస్తాడు. అదే విధంగా పరులకు కూడా అంతా మంచే జరగాలని ఆశించాలి మరియు భగవానుడిని ప్రార్థించాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించ గలడు.


19.08.2019


సంస్కృత లోకోక్తి


ధర్మం చ చింతయేత్ప్రాజ్ఞః


తెలివైన వారు, పండితులు, జ్ఞానులు ఇత్యాది వారు సదా ధర్మమూ గూర్చి మాత్రమే ఆలోచించాలి. ధర్మ మార్గంలో మాత్రమే నడవాలి.


A wise man, Scholar and a Gnani should always think of virtue.


(ఎందుకంటే వారు లోకానికి మార్గ దర్శకులు. మార్గదర్శకులు ఏనాడు అధర్మ మార్గంలో నడవరాదు. అది ఘోర అపరాధమని గ్రహించాలి. అధర్మ మార్గంలో అడిచే జ్ఞాని లేదా మార్గ దర్శకుడు ఘోరంగా శిక్షించ బడతాడు):భర్తృహరి సుభాషితం:

  

బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్వయదూషితాః |

అబోధోపహతా శ్చాన్యే జీర్ణ మజ్ఞ్గే సుభాషితమ్ ||

बोद्धारो मत्सरग्रस्ताः पभवः स्वयदूषिताः |

अबोधोपहता श्चान्ये जीर्णमज्ञ्गे सुभाषितम् ||


తెలిసిన వారలు అసూయతోనున్నారు, ప్రభువులు గర్వాంధులు, సామాన్యులకు వినునంతటి తెలివిలేదు. కావున నేను చెప్పదలచిన సుభాషితము నా యందె అణిగి పోయినది.

భర్తృహరి ‘శతక త్రయం’ లోని నీతి శతకం ఆరంభంలో గల ద్వితీయ శ్లోకం ఇది. శతక ఆరంభంలో అయన చెప్పదలచిన మొదటి మాట ఇది. ‘బోద్ధారో మత్సరగ్రస్తాః’ బోద్ధలగు వారు మత్సరపూర్ణమతులు – తెలిసిన వారు అనగా జ్ఞానులు – జ్ఞానులలో ఈ స్వభావం సర్వ సాధారణము. మత్సరము – అసూయ అధిక శాతము వారిలో ఉంటుంది. ఆహా! నేను ఇంత జ్ఞానిని, నీకేనా వాడు చెప్పేది! అనే భావన ఉంటుంది. అంతే కాదు అధిక శాతము మంది జ్ఞానులు ఇతర జ్ఞానులను చూసి అసూయపడతారు. ‘ప్రభవః స్వయదూషితాః’- ప్రబలగర్వవిదూషితుల్ పభువు లెన్న – ప్రభువులో గర్వము అధికంగా ఉంటుంది. వాడు ఎవరినీ ఆదరించడు. ఆదరిస్తే వాడి రాచరికానికి భంగం ఏర్పడుతుందేమో అని భయం. ‘అబోధోపహతా శ్చాన్యే’ - నితరమనుజు లబోధోసహతులు గాన – ఇక సామాన్యుడి పరిస్ఘితి, వాడికి నేను చెప్పేది వినేటంతటి తెలివి లేదు. అందుకే ‘జీర్ణ మజ్ఞ్గే సుభాషితమ్’ భావమున జీర్ణ మయ్యె సుభాషితంబు – నేను చెప్పదలచిన సుభాషితము నాయందే జీర్ణమై పోయింది. ఈ పరిస్థితి భర్తృహరి ఒక్కడికే కాదు, ఆయనలాంటి సుభాషితాలు చెప్పే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. వారు చెప్పే సుభాషితాలను ఆదరించే వారు, విని ఆచరించే వారు లేనపుడు వారు చెప్పే సుభాషితాలు వారియందే జీర్ణమై పోతాయి. అట్టి సుభాషితాలు మరియు వారి మేధస్సు వలన లోకానికి ఏవిధమైన ప్రయోజనం కూడా ఉండదు. ఈ రీతిగా మంచిమాటలు చెప్పే వారిలో అవి నిక్షిప్తమై పోతాయి. విని గ్రహించి మరియు ఆచరించిన వాడు ధన్యుడు. స్వస్తి. 


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి