नास्ति नारायण समं - न भूतं न भविष्यति

  • Home
    • Sri Gita Gnana Maha Yagna
    • Srimad Bhagavad Gita 3-33
    • Srimad Bhagavad Gita
    • Margashira
    • Eclipses
    • Sri Sharvari Results
    • Planetary Transits
    • Sushant Singh Rajput
    • Desha Arishta Yogas
    • Students - Bhagavad Gita
    • Vaikuntha Ekadashi
    • Sri Matru Panchakam
    • World Peace
    • Antye Smaran
    • Mental Tendencies
  • Sanskrit
  • Products
  • Contact Us
  • Blog
  • About Us
  • Veda Mantra - MP3
    • Downloads
  • Gallery
    • Home
    • Srimad Bhagavad Gita
      • Sri Gita Gnana Maha Yagna
      • Srimad Bhagavad Gita 3-33
      • Srimad Bhagavad Gita
    • Sri Sharvari
      • Margashira
    • Astrology
      • Eclipses
      • Sri Sharvari Results
      • Planetary Transits
    • Articles
      • Sushant Singh Rajput
      • Desha Arishta Yogas
      • Students - Bhagavad Gita
      • Vaikuntha Ekadashi
      • Sri Matru Panchakam
      • World Peace
      • Antye Smaran
      • Mental Tendencies
    • Sanskrit
    • Products
    • Contact Us
    • Blog
    • About Us
    • Veda Mantra - MP3
    • Downloads
      • Downloads
    • Gallery
  • Home
  • Sanskrit
  • Products
  • Contact Us
  • Blog
  • About Us
  • Veda Mantra - MP3
  • Gallery

Sri Gayatri Veda Vision

Sri Gayatri Veda VisionSri Gayatri Veda VisionSri Gayatri Veda Vision

Sri Gayatri Veda Vision (Vedic Astrology & Research)

Sri Gayatri Veda Vision (Vedic Astrology & Research)Sri Gayatri Veda Vision (Vedic Astrology & Research)

Mental Tendencies - Astrology

Mental Tendencies - Astrology

  

ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

 

గ్రహాలు - మానసిక ప్రవృత్తి
 

జ్యోతిష శాస్త్రానికి కర్మ సిద్ధాంతము ఆధారము. మన కర్మలను అనుసరించి మనకు జన్మ లభిస్తుంది. దానికి అనుగుణంగానే మన జీవన శైలి కూడా ఉంటుంది. జ్యోతిషము వలన మన కర్మ ఫలాలను తెలుసుకొనటం వలన జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సత్ఫలితాలను పొంద వచ్చును. జ్యోతిషము మన జీవితాలందు వెలుగును నింపుతుంది. అజ్ఞానాన్ని వీడి జ్ఞానం వైపు అడుగులు వేయడానికి సహకరిస్తుంది.
 

మనము ఎన్నో సందర్భాలందు చూస్తుంటాము. మన పిల్లలు అద్భుతంగా చదువుతారు, వారిలో గొప్ప తెలివితేటలూ ఉంటాయి. చక్కని బుద్ధి కుశలత విశ్లేషణ పరిజ్ఞానము కూడా ఉంటుంది. కాని పరీక్షలందు వారి ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉంటాయి. ప్రధానంగా పోటీ పరీక్షలందు ఇట్టి ఫలితాలు ఇంకను నిరాశాజనకంగా ఉంటాయి. ఇప్పుడు మనము విద్యాభ్యాసము, మానసిక ప్రవృత్తి గూర్చి క్లుప్తంగా తెలుసుకొందాము:
 

ఒక జాతకుడు చక్కగా చదువుతాడా పరీక్షలందు చక్కని మార్కులతో ఉత్తీర్ణుడు అవుతాడా లేదా అని తెలుసుకోవడానికి ప్రధానంగా విద్య మరియు బుద్ధి స్థానాలు, సప్తమ మరియు రాజ్య స్థానాలు, వాటిని ప్రభావితము చేస్తున్న గ్రహాలను, వాటి దృక్బలము, షడ్బలము, ఇష్ట మరియు కష్ట ఫలాలను, రశ్మి బలాలను అధ్యయనము చేయవలసి ఉంటుంది. విద్య స్థానము శక్తి వంతమే కాని బుద్ధి స్థానము పరిస్థితి ఏమిటని చూడాలి. చక్కని బుద్ధి కుశలత మరియు జ్ఞాపక శక్తి లేని చదువు వ్యర్థమే. విద్యార్థి తను చదివిన దానిని పరీక్షలందు విశదీకరించి వ్రాయవలసి ఉంటుంది. అప్పుడే పరీక్షలలో చక్కని మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశముంది.
 

బుద్ధి స్థానాన్ని గురు మరియు శుక్ర భగవానులు ప్రభావితము చేసినపుడు వారిలో చక్కని తెలివితేటలూ ఉంటాయి. వారిలో చక్కని విశ్లేషణ పరిజ్ఞానము ఉంటుంది. చక్కని స్పురణ శక్తి ఉంటుంది. వారు తాను చదివిన దానిని చక్కగా విశదీకరించ గల సామర్థ్యము గల వారౌతారు. 

బుధ చంద్ర భగవానులు ప్రభావము వలన వారిలో చక్కని తెలివితేటలుంటాయి. కాని మనస్సు చంచలమౌతుంది. వారు త్వరగా మరియు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొను వారౌతారు. సమయాను సారంగా వారి ఆలోచనలు మారిపోతుంటాయి. వారిలో తొందరపాటుతనం అధికంగా ఉంటుంది. ఓపిక తక్కువగా ఉంటుంది.


కాని జాతకాన్ని శని రాహువు మరియు కేతువు భగవానులు ప్రతికూలంగా ప్రభావితము చేసినట్లయితే వారిలో చంచలత్వము అధికముగా ఉంటుంది. కన్ఫ్యూషన్ అధికముగా ఉంటుంది. స్పష్టత ఉండదు. ఇలాంటి యోగాలు గల వారు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ అధికంగా ఉంటుంది. భయము ఆందోళనలు అధికంగా ఉంటాయి. తనపైన తనకు నమ్మకము తక్కువగా ఉంటుంది. పిరికివారు అవుతారు. ఊహాజనితమైన ఆలోచనలు అధికంగా ఉంటాయి.

శనేశ్వరుడి ప్రభావము వలన మంద బుద్ధి అధికమౌతుంది. చదివింది గుర్తుండదు. మరిచిపోతూ ఉంటారు. ఇలాంటి కొన్ని అత్యంత ప్రతికూలమైన యోగాలు గల వారిలో భయంకరమైన ఆలోచనలు కూడా వచ్చే అవకాశము ఉంటుంది.


చంద్ర శని రాహువు కేతువు మరియు కుజ భగవానుల ప్రతికూల ప్రభావము వలన వారిలో ఉద్రేకము, కోపము, భయము మరియు వక్ర బుద్ధి అధికంగా ఉంటుంది. సందర్భాలందు వాడు ఉన్మాదిగా మారే అవకాశాలు ఉంటాయి. శనేశ్వరుడి ప్రభావము వలన వారికి విద్యాభ్యాసము పట్ల శ్రద్ధ తగ్గుట, అవరోధాలు అధికమగుట, రాహువు కేతువుల ప్రభావము వలన అనుకోని మార్పులు, బుధ మరియు చంద్ర భ. వలన వారికీ వివిధ రంగాలందు శ్రద్ధ అధికమౌతుంది కాని ఏ ఒక్క రంగములో కూడా వారు నిష్ణాతులు కాలేని వారగు సూచనలు ఉన్నాయి.
 

చంద్ర మరియు బుధ భగవానులు జాతకమును అధికంగా ప్రభావితము చేసినట్లయితే వారిలో వ్యాపార ప్రవృత్తి అధికమగు సూచనలు ఉన్నాయి. వారు నిరంతరమూ మారుతున్న వృత్తులందును, స్వంతముగా నడుపుకోను వృత్తి మరియు వ్యాపారము లందును అధిక శ్రద్ధను కనబరచు వారగు సూచనలు ఉన్నాయి. ఇట్టి యోగాలు గల వారికి ఉన్నత విద్య యందు శ్రద్ధ తక్కువగా ఉంటుంది. వారికి పిన్న వయస్సు మొదలు వృత్తి మరియు వ్యాపారములందు అధిక శ్రద్ధ ఏర్పడు అవకాశాలు ఉన్నాయి. వీరు నిరంతరమూ వృత్తులను మార్చు ప్రవృత్తి గల వారగు సూచనలు ఉన్నాయి. ఇట్టి యోగాన్ని శుక్ర భగవానుడు కూడా ప్రభావితము చేసినట్లయితే వారికి శారీరిక సుఖాల పట్ల మరియు విలాసాల పట్ల శ్రద్ధ పెరిగి ఉన్నత విద్య యందు వారికి శ్రద్ధ క్రమముగా తగ్గు సూచనలు ఉన్నాయి.  పైన వివరించ బడిన శుభాశుభ యోగాలను శుభ లేదా పాప గ్రహాలు ప్రతికూలముగా ప్రభావితము చేసినట్లయితే ఇట్టి శుభాశుభ ఫలాలందు మార్పులు సంభవించు సూచనలు ఉన్నాయి.


ఇట్టి యోగాలు విద్యార్థులను మాత్రమే కాదు, ఇతరులను కూడా ప్రభావితం చేయు సూచనలున్నాయి. ఇట్టి ప్రభావము విద్యార్థులు కాని వారికి ఏ విధంగా ఉంటుందో రాబోవు శీర్షికలో తెలుసుకుందాము.


వయోజనులు – గ్రహాలు మానసిక ప్రవృత్తి


గ్రహ ప్రభావము వయోజనుల మానసిక ప్రవృత్తి పై ఎలా ఉంటుందో తెలుసుకుందాము. తనూ భావము,వాక్కు స్థానము, బుద్ధి స్థానము, సప్తమ స్థానము, రాజ్య స్థానము, లాభ మరియు వ్యయ స్థానములు మరియు వాటిని ప్రభావితం చేస్తున్న గ్రహాలను అనుసరించి మనిషి యొక్క మానసిక ప్రవృత్తిని తెలుసుకోవచ్చును. మనం ఆచరించిన కర్మలకు అనుగుణంగా మనకు జన్మ లభిస్తుంది. అట్టి కర్మ ఫలాలను అనుభవించుటకు గాను తగిన విధంగా గ్రహ యోగాలు గల లగ్నంలో, సమయంలో మనం జన్మిస్తాము. అట్టి గ్రహ యోగాలకు అనుగుణంగా మనం ఫలితాలను అనుభవించడం తథ్యం. ‘Every action has its own reaction’ అనగా ‘మనం ఆచరించే ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది’. ఇది తథ్యం. కర్మను ఆచరించామా! దాని ఫలితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అట్టి ఫలితాలను సూచించేదే జ్యోతిషం. కర్మ ఫలాల ధార ఏవిధంగా ప్రవహిస్తుందో తెలుసుకొని మన కర్మలను మార్చుకోవడం ద్వారా సత్ఫలితాలను పొంద వచ్చును.


లగ్నాన్ని ప్రభావితం చేస్తున్న గ్రహాల వలన వ్యక్తి యొక్క సాధారణ ప్రవృత్తి గూర్చి తెలుసుకోవచ్చును. లగ్నాన్ని:

సూర్యుడు - ప్రభావితం చేస్తే రాజ సంబంధ లక్షణాలను ఇస్తాడు. క్షమా గుణం అధికంగా ఉంటుంది. చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉంటారు. 


చన్ద్రుడు – ప్రేమ అనురాగాలను ప్రసాదించు వారు, మాతృ మరియు క్షమా గుణం అధికంగా ఉంటుంది, వ్యాపార ప్రవృత్తి గల వారు, వేషధారణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను వహించు వారు. 


అంగారకుడు – క్రమశిక్షణా, ఇతరులపై అధికారమును చలాయించు స్వభావము,దండనా ప్రవృత్తి లేదా శిక్షించే స్వభావము, కోపము అధికం, మొండితనం, యుద్ధనీతి, ప్రణాళికా సామర్థ్యము.


బుధుడు – చురుకుగా చలాకీగా ఉండే స్వభావము, పనులను చాకచక్యముగా చేయగల వారు, చక్కని వాక్చాతుర్యము,ఎంతటి వారినైనను మెప్పించ గల స్వభావము, ఒకటి కంటే ఎక్కువ పనులు ఏకకాలంలో నిర్వహించు వారు, భిన్నమైన వృత్తులను చేపట్టు వారు, తరచుగా ఆలోచనలు మరియు వృత్తులను మార్చు స్వభావము, నిరంతరం వృత్తులను మార్చు ప్రవృత్తి. 


బృహస్పతి – సత్కర్మలను ఆచరించే ప్రవృత్తి, ధర్మాధర్మ విచక్షణ,న్యాయాన్యాయా విచక్షణ, శాస్త్ర ప్రమాణాలను అనుసరించు వారు, సలహాలివ్వగల శక్తి గల వారు, చక్కని బోధన పటిమ, కొన్ని ప్రతికూల గ్రహ యోగాల వలన కొంత గర్వము కూడాను, అన్నీ తనకే తెలుసుననే అభిప్రాయము.


శుక్రుడు – అందము, కళలు, శారీరిక సుఖాలు, విలాసాలు, సృజనాత్మకత ఇత్యాది వాటికి అధిపతి. జన్మ లగ్నమును గాని చతుర్థ రాజ్య స్థానాలను గాని ఇట్టి గ్రహ ప్రభావితం చేసిన ఎడల జాతకుడిలో ఈ విధమైన ప్రవృత్తి అధికంగా ఉంటుంది. శరీరానికి కష్టం కాకుండా పనులు అయిపోవాలనే స్వభావము వీరిలో ఎక్కువగా ఉంటుంది. సుఖాలను అనుభవించే మనస్తత్వము అధికంగా ఉంటుంది. జాతకాన్ని పాప గ్రహాలు ఇతరత్రా ప్రభావితం చేయని ఎడల ఇట్టి సుఖాలను వీరు అనుభవిస్తారు. 


శని – తగ్గిన నిర్ణయాత్మక శక్తి. పనులను నిరంతరం వెనక వేయు ప్రవృత్తి. సోమరితనము. కష్టపడితేనే ఫలితం. కొన్ని సందర్భాలందు కష్టానికి తగిన ప్రతిఫలం లభించక పోవుట. శారీరిక శ్రమ అధికం. వృత్తి పట్ల శ్రద్ధ తగ్గుట. ప్రధానంగా స్త్రీ లందు ఈ యోగ ప్రభావము వలన వారిలో ఎంత నైపుణ్యం ఉన్నా కూడా వారు రాణించ లేక గృహిణిగా ఉండి పోవు వారు. పురుషులయందు అభివృద్ధి పరంగా పలు విధాలైన అవరోధాలు ఎదుర్కోను వారు.


రాహువు మరియు కేతువు – అనిశ్చితి, నిర్ణయం తీసుకోలేని వారు, ఊహాజనితమైన ఆలోచనలు, వక్ర బుద్ధి, మోస ప్రవృత్తి, వ్యసనముల వైపు మొగ్గు చూపు వారు, ఫలితాలను సాధించడానికి సత్వర మార్గాలను వెతుకు వారు (shortcut methods), ఉపాసనలందు శ్రద్ధ అధికం, కాని మనస్సు నిశ్చలంగా లేక పోవుట వలన దాని ఫలం సిద్ధించక పోవుట, కేతువు ప్రభావం వలన మోక్షాపేక్ష అధికం.


  

ద్వితీయ స్థానం – గ్రహ ప్రభావం


ద్వితీయ స్థానం ప్రధానంగా ధన, మిత్ర, కుటుంబ, వాక్కు ఇత్యాది స్థానాలను సూచిస్తుంది. ఇట్టి స్థానాలు జాతకుడు వ్యసనాలను కూడా సూచిస్తుంది. వారి వాక్కు ఏవిధంగా ఉంటుంది, వారు ఎలాంటి వారితో మితృత్వం చేస్తారు, సప్తమ స్థానాధిపతి తో ప్రమేయం ఉన్న ఎడల ప్రేమ వివాహాలు, వాడి ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది. వాడు ఎలాంటి పెట్టుబడులు చేస్తాడు, వాడిలో మోస ప్రవృత్తి ఉంటుందా? ఇత్యాది విషయాలు మనం ద్వితీయ భావం ద్వారా గమనించ వచ్చు. ఈ స్వభావాలకు అనుగుణంగా వాడి మానసిక ప్రవృత్తి కూడా ఉంటుంది. ఉదాహరణకు: ఒక జాతకుడికి పొగాకు ఇత్యాది వ్యసనాలు ఉంటాయా లేదా మనం ఈ భావం ద్వారా గ్రహించ వచ్చును. ఈ భావం లో ఇలాంటి సూచనలు ఉంటె వాడి మానసిక ప్రవృత్తి కూడా అదే విధంగా ఉంటుంది. ఇక ద్వితీయ భావాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తే ఎలా ఉంటాయో చూద్దాము:


సూర్యుడు – ఉన్నత స్థానములందు ఉన్న వారితో మితృత్వము చేయు స్వభావము. హుందాగా మాట్లాడు వారు. దుబారా ఖర్చులు, ధన సంపత్తి సమయానుసారముగా కరిగి పోవుట. ధన సంపత్తి అనుకున్నంతగా ఉండక పోవుట. మిత్రులలో పురుషులు అధికంగా ఉంటారు.


చన్ద్రుడు – వ్యాపార ప్రవృత్తి, లాభాపేక్ష యందు అధిక ఆసక్తి, సందర్భము లందు పీనాసితనము, స్త్రీలతో ఎక్కువగా మితృత్వము చేయు వారు, చక్కని వాక్కు, చక్కని స్వరము, ఇతరులను అతి సునాయాసంగా మెప్పించ గల శక్తి సామర్థ్యాలు గల వారు. ఈ స్థానాన్ని ఇతర గ్రహాలు ప్రతికూలంగా ప్రభావితం చేయని ఎడల వీరు అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారి వాక్కులో ప్రేమ అనురాగాలు ఉంటాయి.


కుజుడు – ముక్కుకు సూటిగా మాట్లాడు స్వభావము, కోపము మరియు మొండితనము అధికం. తమ మాట వినే వారితోనే మితృత్వం చేస్తారు. ఇతరులను దగ్గరకు రానివ్వరు. పురుష సహవాసం అధికం. ఖర్చులు కాస్త అధికం కాని ఇతర శుభ గ్రహాల ప్రభావం వలన చక్కని ధన సంపత్తిని ప్రసాదిస్తాడు. మాటలో గరుకుతనం అధికం. వేరు ఇతరులతో సర్దుకొని పోవడం కష్టం గా ఉంటుంది.


బుధుడు – ధారాళంగా మాట్లాడగల సామర్థ్యము, ఎంతటి వారినైనను మెప్పించ గల సామర్థ్యం, బోధన రంగములు మరియు సేల్స్, మార్కెటింగ్ రంగాలలో ఉండే వారు, ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ధనార్జన, అశేష మిత్ర జన సందోహం, ఇతరులతో చాలా సులువుగా మిత్రుత్వాన్ని చేయు స్వభావం, వీరు సర్వ సాధారణంగా ఎవరినీ నొప్పించరు. చక్కని చిరునవ్వు. వ్యంగ్యము మరియు హాస్యము నందు శ్రద్ధ గల వారు.


బృహస్పతి – చక్కని వాక్కు, వేద పఠనము నందు శ్రద్ధ గల వారు, స్వర యుక్తంగా వేదాన్ని పఠించు వారు, కంచు లాంటి కంఠము, చక్కని బోధన పటిమ, ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడగల సామర్థ్యము గల వారు, సంస్కృత భాష యందు శ్రద్ధ గల వారు, ధర్మ బోధ చేయు వారు, ఉత్తములతో మితృత్వము చేయు వారు. చక్కని ధన సంపత్తి. వ్యసనాలకు దూరంగా ఉండు వారు. క్లాసికల్ సంగీతం నందు శ్రద్ధ గల వారు


శుక్రుడు – స్త్రీ సాంగత్యము నందు అధిక శ్రద్ధ, యజుర్వేద పఠనము చేయు వారు, చక్కని మరియు 

విశేషమైన ధన సంపత్తి, ధనార్జనకు సులువైన మార్గాలు వెతుకు వారు, సంగీత మరియు సాహిత్య ప్రియులు, ఇతర జానపద గాత్రము నందు శ్రద్ధ గల వారు. ఆధునిక సంగీతము నందు శ్రద్ధ గల వారు. చక్కని చిరునవ్వు.


శని – సదా ముభావంగా ఉంటారు, మితభాషులు, నవ్వు తక్కువగా కనిపిస్తుంది. అవసరానికి తగినంతగా మాత్రమే మాట్లాడే స్వభావం గల వారు. ఆర్థికంగా కొంత వెనకబడి ఉంటారు, శ్రమకు తగిన ధనార్జన కనబడదు. పెట్టుబడులు నిలిచి పోతూ ఉంటాయి. నాలుక తిరగదు, కావున వీరి వాక్కు అనుకున్నంత స్పష్టంగా ఉండదు. ముఖము పేలవంగా ఉంటుంది. ఒక విధమైన ఉదాసీనత కనిపిస్తూ ఉంటుంది. ఇట్టి యోగము గల కొందరికి సంగీతము నందు శ్రద్ధ ఉన్నను వారి స్వరం మాత్రం వినుటకు ఇంపుగా ఉండదు.


రాహువు మరియు కేతువులు – వాక్కు మరియు చేతలు పరస్పరం భిన్నంగా ఉంటాయి. వీరి వాక్కుపై వీరికి నియంత్రణ ఉండదు. వీరి వాక్కు ఎదుటి వారిని నొప్పించు విధంగా ఉంటుంది. వ్యసనాలకు చాలా సులువుగా ఆకర్షితులౌతారు. ప్రారంభ దశలో  గోప్యంగా వ్యసనాల వైపు మొగ్గు చూపు వారు. మత్తు పదార్థాలయందు శ్రద్ధ అధికంగా ఉంటుంది. వీరిలో ఊహాగానాలు అధికంగా ఉంటాయి. అక్రమ ధనార్జన వైపు మొగ్గు చూపుతారు. మోస ప్రవృత్తి ఉంటుంది. ఈ విధమైన అలవాట్లు గల వారితోనే మితృత్వం చేస్తారు.


సూచన:

పైన వివరించ బడిన యోగాలన్నీ కూడా సాధారణ యోగాలు మాత్రమే అని గ్రహించాలి. ఇట్టి యోగాలను ఉన్నది ఉన్నట్లుగా అన్వయించ రారు. ఇట్టి యోగాలను ఇతర గ్రహాలు ప్రభావితం చేసిన ఎడల పైన సూచించ బడిన ఫలితాలు సంపూర్ణంగా మారిపోవు అవకాశం ఉంది. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో జాతక ఫలాలను అన్వయించుకోరాదు. ఇది అత్యంత ప్రమాదకరం కూడాను. జ్యోతిర్విద్యలో పరిపూర్ణత సాధించిన మరియు అనుభవస్తుడు అయిన జ్యోతిష్యుని తో సలహా సంప్రదింపులు చేయాలి. 


తరువాయి భాగం వచ్చే శీర్షికలో....


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

image96

Copyright © 1995 - 2020 Sri Gayatri Veda Vision  - All Rights Reserved.
No part of this publication may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the publisher.

Powered by GoDaddy

  • Home
  • Sri Gita Gnana Maha Yagna
  • Products
  • Contact Us
  • Blog

Cookie Policy

This website uses cookies. By continuing to use this site, you accept our use of cookies.

Accept & Close