Desha Arishta Yogas

Yogas indicating a Bad Period for World

శ్రీ గణేశాయ నమః - శ్రీ మాత్రే నమః - శుభ గ్రహా

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

శ్రీ వికారి – శ్రీ శార్వరి దేశారిష్ట యోగాలు

శ్రీ వికారి నామ సంవత్సరంలోను మరియు శ్రీ శార్వరి నామ సంవత్సరంలోను ఏర్పడ్డ దేశారిష్ట యోగాలు ప్రస్తుత 

భయంకరమైన పరిస్థితికి కారణముగా అగుపడు చున్నది.

‘శార్వరి’ అనగా చీకటి, విచారము మరియు దుఃఖము తో కూడినది. క్రూరమైనది, హింసా ప్రవృత్తి గలది, నాశనం చేసే ప్రవృత్తి గలది అని అర్థము.

(శ్రీ వికారి నామ సంవత్సరంలో అనూహ్యమైన అసాధారణమైన ఫలితాలు ఉంటాయని గత సంవత్సరంలో చెప్పబడినది).

వాటి అర్థాలకు అనుగుణంగా అవి ఫలితాలను ఇస్తూ వస్తున్నాయి. వాటి ఫలితాలను మనం స్పష్టంగా చూడ వచ్చును. శ్రీ వికారి నామ సంవత్సరం నిజానికి చాలా విధాలైన అనూహ్య మరియు అసాధారణమైన ఫలితాలను ఇచ్చింది అని అనడంలో సందేహము గాని సంకోచము గాని లేదు. అదే విధంగా శ్రీ వికారి వెళ్తూ కూడా అనూహ్యమైన మరియు అసాధారణమైన ‘కరోనా’ ను మనకు అంటగట్టి, రాబోవు శ్రీ శార్వరి నామ సంవత్సరం పేరుకు తగిన విధంగా ఎన్నో విధాలైన కష్టాలను, ఊహించని అంధకారాన్ని, విచారాన్ని, దుఃఖాన్ని, క్రూరమైన మరియు నాశన ప్రవృత్తి గల ఫలితాలను ఇస్తూ కూడా ప్రారంభమౌతున్నది. ఇది చాలా బాధాకరం.

శ్రీ వికారి నామ సంవత్సరంలో ఏర్పడ్డ కొన్ని దేశారిష్ట యోగాల గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాము:

1. 25.12.2019 నుండి 27.12.2019 వరకు ధనుస్సు రాశిలో ఏర్పడ్డ ‘షడ్గ్రహా కూటమి’. ఇట్టి కూటమిలో పాల్గొన్న గ్రహాలు: సూర్య చన్ద్ర గురు శని బుధ కేతువులు. ఇదే సమయంలో అనగా 26.12.2019 నాడు ‘కేతుగ్రస్త అర్ధాధిక గ్రాస సూర్య గ్రహణం’. గ్రహణ సమయంలో గ్రహణ రాశి అనగా ధనస్సులో షడ్గ్రహా కూటమి. తదనంతరం అదే రాశిలో 13.01.2020 వరకు పంచ గ్రహా కూటమి: సూర్య గురు శని బుధ కేతువులు ఈ యోగంలో పాలు పంచుకున్నాయి. ఇది ఒక భయంకరమైన దేశారిష్ట మరియు ప్రపంచారిష్ట యోగము. ఇట్టి యోగాలు క్రితం సంభవించిన ప్రతిసారి మానవాళికి భారీ ఎత్తున నష్టం సంభవించింది. మహాభారత యుద్ధ సమయంలో కూడా ఇదే విధమైన గ్రహ యోగాలు ఉన్నాయని జ్యోతిష పరిశోధకులు వెల్లడించారు. అప్పుడు 3 గ్రహణాలు కూడా సంభవించాయని వారి అభిప్రాయము. అయితే ఇప్పటి యోగాలు కలి యుగాంతానికి కారణ మౌతాయని కొంత మంది విశ్లేషించారు. కాని అది తప్పు. కలియుగ ప్రథమ పదంలో ఇప్పటివరకు గడచిన సంవత్సరాలు 5121 మాత్రమే. కావున కలియుగాంతం అను ప్రస్తావన లో నిజం లేదు. కాని ఈ యోగాలు ప్రపంచాన్ని మొత్తంగా వణికించే ప్రమాదం తప్పక ఉంది. ఒకవైపు మరణాలు మరొక వైపు ఆర్ధిక మాంద్యం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడుటకు గాను వేల మరియు లక్షల కోట్లు ఖర్చు చేయడం వలన దేశాభివృద్ధి కి గాను వారి వద్ద ధన సంపత్తి సరిపడా లేకపోవుట వలన ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధి కుంటుబట్టే అవకాశం తప్పక కలదు. దీని ప్రభావం రాబోవు మరి కొన్ని నెలల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. 

2. ఇట్టి యోగంలో ఓజా శక్తిని ప్రసాదించు సూర్యుడు ఉండుట వలన ప్రజలలో ఓజా శక్తి ఇమ్మ్యూనిటి ని తగ్గించుట, చన్ద్ర శని మరియు కేతువులు భ లు అంటువ్యాధులను ప్రసాదించు వారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు గురు భ వలన, గుండె కు చెందిన వ్యాధులు సూర్య మరియు కేతువుల వలన, నాడి వ్యవస్థను ప్రభావితం చేయు వ్యాధులు బుధ మరియు కేతువుల వలన వస్తాయి. చెవి ముక్కు మరియు గొంతుకు చెందిన వ్యాధుల శని భ ద్వారా వస్తాయి. ఇట్టి యోగంలో ఇవే గ్రహాలు పాల్గొనడం వలన ‘కరోనా’ గా చెప్పుకోబడుతున్న వ్యాధి ప్రస్తుతం మనను పీడిస్తున్నది.

3. 31.03.2020 నుండి మొదలు కుజ గురు మరియు శని భ లు మకర రాశిలో సంచరించుట. ఇట్టి యోగ ప్రభావము 05.05.2020 వరకు కూడా ఉంటుంది. 05.05.2020 నాడు కుజుడు కుంభంలో ప్రవేశించిన పిమ్మట ఇట్టి ‘కరోనా’ వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతకంటే ముందు సూర్య భ మేష రాశిలో ప్రవేశించిన పిమ్మట క్రమంగా ప్రజలలో రోగ నిరోధక శక్తి పెరుగుట మరియు రోగ పీడను ఎదుర్కోను శక్తి ప్రజలలో వస్తుంది. వైరస్ వ్యాధికి, నిజానికి మందు లేదు. శరీరంలో గల రోగ నిరోధక శక్తి ఒక్కటే దీనికి విరుగుడు.

4. చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడిగారు: ఈ యోగాల గూర్చి మీరు ఇంతకూ ముందే ప్రస్తావన చేసి ఉంటే మేము జాగ్రత్త పడేవాళ్ళము కదా! అని. కాని అది అసాధ్యం. జ్యోతిష శాస్త్రానికి కొన్ని అవధులు ఉన్నాయి. నేను ఒక్కడినే కాదు,ప్రపంచంలో నాకంటే కూడా నిష్ణాతులైన జ్యోతిషులు ఎంతోమంది ఉన్నారు. వారి ఊహకు కూడా ఇది అందలేదు. ప్రతి ఒక్కరూ దేశారిష్ట యోగాన్ని పసిగట్టారు,కాని ఈ విధమైన భయంకరమైన విపత్తు వచ్చి పడుతుందని ఏ ఒక్కరూ ఊహించలేక పోయారు. ఇది భగవంతుడి నిర్ణయం. మనం మానవ మాతృలం. ప్రతి ఒక్కటి మనమే గ్రహించ గలిగితే ఆ బ్రహ్మదేవుడికి మరియు మనకు తేడానే ఉండదు. ఇది కర్మ సిద్ధాంతం. కర్మ అనుభవించే సమయం ఆసన్నమైన నాడు ఇదే విధంగా జరుగుతుంది.

జ్యోతిష పరంగా ఉపశమనాలు:

వైద్యశాస్త్ర పరంగా ఏ వైరస్ కు అయినా కూడా మందు ఉండదు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం లేదా రోగం రాకుండా కాపాడే టీకా లు తీసుకోవడం.

జ్యోతిష శాస్త్రానికి ఆధారం కర్మ సిద్ధాంతం. మనిషి తన కర్మలను అనుసరించి ఫలాన్ని పొందుతూ ఉంటాడు. ఈ విధమైన యోగాలు లోకారిష్ట యోగాలు. లోకంలో పాప కర్మలు పెరిగిపోయిన నాడు ఈ విధమైన చిక్కులు ఎదురౌతూ ఉంటాయి. అందుకే మనిషి సదా సత్కర్మలనే ఆచరిస్తూ ఉండాలి. అప్పుడే లోక సంగ్రహము జరుగుతుంది. జ్యోతిషము ను అనుసరించి క్రింద వివరించ బడిన శాంతులు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి.

1. ప్రధానంగా, ప్రతి ఒక్కడు రోగ నిరోధక శక్తిని పెంపొందించు కోవాలి. తగిన విధంగా ఆహారము, వ్యాయామము మరియు యోగాభ్యాసము చేస్తూ ఉండాలి.

2. మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించు వాడు భాస్కరుడు. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచు వాడు సూర్యుడే. కావున శ్రీ సూర్యోపాసనలు శుభ ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా ఘృణి సూర్య మంత్రం జపం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఘృణి సూర్య మంత్రం ‘ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య ఓం’ అనే మంత్రాన్ని నిత్యం 108 సార్లు సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఉదయాన్నే జపం చేసుకోవాలి. ఈ మంత్రానికి ఉపదేశం అవసరం లేదు. ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణం చేసుకోవాలి. ‘అరుణ ప్రశ్న (తైత్తిరీయ ఆరణ్యక అరుణ ప్రశ్న) అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇవి వేద మంత్రాలు. దీని పారాయణ అందరూ చేయలేరు కావున అభ్యాసం గల వారు నిత్యం పారాయణం చేసుకొనుట లేదా పారాయణం వినుట. వినుట వలన కూడా ఫలితం లభిస్తుంది.

3. శ్రీ మహా విష్ణు ఆరాధనలు. ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షర మంత్రం లేదా ‘ఓమ్ నమో భగవతే వాసుదేవాయ’అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేసుకోవాలి. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పారాయణ చేయడం లేదా వినడం కూడా శ్రేయస్కరమే.

4. శ్రీ దేవి సప్తశతి పారాయణం అద్భుత ఫలితాలను ఇస్తుంది:

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।

భయేభ్యః స్త్రాహినో దేవి దుర్గే దేవీ నమోస్తుతే ।। (దేవీ మహాత్మ్యం ౧౧-౨౪)

సర్వ స్వరూపము, సర్వేశ్వరివి, సర్వ శక్తులతో కూడిన దానవు అయిన ఓ దేవి! దుర్గా! మమ్ము భయముల నుండి కాపాడుము. నీకు మా నమస్కారము.

ఓం రోగా నశేషా నపహంసి తుష్టా

రుష్టాతు కామాన్ సకలా నభీష్టాన్ ।

త్వా మాశ్రితానాం నవిపన్నరాణాం

త్వా మాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ।। (దేవీ మహాత్మ్యం ౧౧-౨౯)

ఓ దేవీ! నీవు తృప్తినొందిన ఎడల రోగము లన్నిటిని అపహరింతువు కోపించినచో కోరికల నన్నిటినీ కూలుతువు. నిన్ను ఆశ్రయించిన వారికి ఆపదలుండవు. అంతేకాదు వారు ఇతరులకు ఆశ్రయము ఇచ్చే వారగుదురు.

ఓం ఉపసర్గా నషేశాం స్తు, మహామారీ సముద్భవాన్ ।

తథా త్రివిధ ముత్పాతం, మహాత్మ్యం శమయేన్మమ ।। (దేవీ మహాత్మ్యం ౧౨-౮)

మహామారి (మహామారి అనగా అంటురోగాలు) వలన కలిగిన అశేష ఉపద్రవములను, భౌమ, అంతరిక్ష మరియు దివ్యములు అనెడి త్రివిధ ఉత్పాతములను నా మహాత్మ్యము శమింప చేయును.

ఇవి శ్రీ దేవి సప్తశతి లోని ప్రమాణాలు. కాలానుగుణంగా కలిగే వ్యాధుల నివారణకు మరియు మహామారి లాంటి ఉత్పాతాలకు శ్రీ దేవి మహాత్మ్యం లేదా శ్రీ దేవి సప్తశతి లేదా శ్రీ దుర్గా సప్తశతి పారాయణం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

చివరిగా – ఈ భయంకరమైన పీడ నుండి మనను కాపాడుటకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు కావలసిందల్లా వారికి మనం సహకరించడమే. ఈ రోగ పీడ నుండి మనకు కాపాడుటకు గాను తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః । గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు. ।। "स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां- न्यायेन मार्गेण महीं महीशाः । गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं- लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति 

------------------------------------------------------------------------------------------------ 

శ్రీ గణేశాయ నమః - శ్రీ మాత్రే నమః - శుభ గ్రహా

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

కరోనా వ్యాధి – జ్యోతిష అంశాలు

‘కరోనా’ పేరు చెప్పగానే ఎంతటి వాడైనా వణికి పోవాల్సిందే. కరోనా వైరస్ లేదా Covid-19 వైరస్. ఇది ఒక క్రొత్త రకమైన వైరస్. ఇతి కరోన వైరస్ వెనక గల జ్యోతిష విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము:

ఇట్టి వైరస్ వెనక గల ప్రధాన గ్రహాలు:

కుజుడు: మన శరీరంలోని రక్తానికి కారకుడు. ఓజా శక్తిని ప్రసాదించు వారు. ఎర్ర రక్త కణాలకు అధిపతి. ఊహించని విధంగా విస్ఫోటనమైన జ్వరాలు, శరీర ఉష్ణోగ్రత.

బృహస్పతి: శరీరము నందలి గ్రంథులు, శ్వాస కోశము మరియు తత్సంబంధిత అవయవాలు, హార్మోనులు

శని: మజ్జ, చర్మము, ఎముకలు, మందగించు శక్తి

కేతువు: క్రిమి కీటకాదులు, క్రొత్త విధమైన తెలియని క్రిములు, బాక్టీరియా మరియు పలు విధములైన వైరస్

రాహువు: తెలియని రోగాలు. అల్లర్జీలు, విష ప్రయోగాలు.

పైన ఉదాహరించిన ఈ 5 గ్రహాల వలన ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న కరోన వైరస్ సమస్యలు. క్రింది విధమైన యోగాలు చాలా అరుదుగా వస్తాయి.

ప్రధానంగా శ్రీ వికారి నామ సంవత్సరంలో అనూహ్యమైన మరియు అసాధారణమైన ఫలితాలు ఉంటాయని ఇతః పూర్వమే చెప్పబడినది.

ధనుస్సు రాశి యందు గురు శని కేతువులు:

నవంబర్ 5, 2019 నాడు గురు భ ధనస్సులో ప్రవేశించిన మొదలు శని మరియు కేతువులతో కలిసి ఉన్నాడు. ఇట్టి యోగము శ్వాసకోశమును ప్రభావితం చేసే వ్యాధులకు మూలకారణ మగు చున్నది. కరోన వైరస్ ప్రధానంగా శ్వాసకోశ మరియు తత్సంబంధిత అవయవాలను ముందుగా ప్రభావితం చేస్తుంది. ఇట్టి యోగము దీనికి మూల కారణముగా అగుపడు చున్నది. అట్టి యోగములో కేతువు కూడా కలిసి ఉండుట వలన వైరస్ క్రిముల ఉత్పత్తి ప్రారంభమగుట మరియు ఇట్టి అవయవాలు బలహీనముగా ఉన్న వారిపై దాడి చేయడం ప్రారంభమైంది. రాహువు మరియు కేతువులు ఒకరి నుండి మరొకరికి సోకే వ్యాధులను అనగా అంటురోగాలను ఎక్కువగా ఇస్తాయి.

మకర సంక్రమణం (14.01.2020) పిదప మకర రాశిలో సూర్య మరియు శని భ.

ఇట్టి యోగ ప్రభావము వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుట. తద్వారా వైరస్ ఇన్ఫెక్షన్ ను ఎదుర్కొనే శక్తి తగ్గుట. తద్వారా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుట.

ధనుస్సు రాశి యందు కుజ మరియు గురు భ:

08.02.2020 నాడు అంగారకుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన మొదలు గురు మరియు కేతువులతో కలిసి ఉండుట మరియు రాహువుతో సమసప్తకమై ఉండుట వలన, ఇట్టి వ్యాధి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒకరినుండి మరొకరికి సోకు అంటువ్యాధిగా మారిపోయింది.

మకర రాశి యందు గురు మరియు శని భ స్థితి (30.03.2020):

ఇట్టి యోగము మనిషి శరీరములోని గ్రంథుల మరియు శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణముగా మనం పరిగణించ వచ్చును. గురు శని భ కలయిక వలన ఇట్టి అవయవాల పనితనము తగ్గుతుంది. ప్రధానంగా శ్వాసకోశము నకు చెందిన పనితనము క్రమంగా తగ్గుతుంది. అది తగ్గుట వలన ఈ విధమైన వైరస్ లు త్వరగా ఈ అవయవాలను ప్రభావితం చేయగలుగుతాయి. ఇది ప్రధానంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సూచించ బడిన జాతకులపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇట్టి యోగములు గల వారు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇట్టి యోగ ప్రభావము వలన ప్రపంచ ఆర్థికాభివృద్ధి కుంటుబడుతుంది. మందగమనము మరియు తిరోగమనమునకు ప్రధాన కారణమూ కూడా కాగలదు. ఇట్టి యోగ ప్రభావము జూన్ 2020 చివరి వరకు కూడా ఉంటుంది.

మరి కరోన వ్యాధి ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది?

ఏప్రిల్ 14 నాడు మేష సంక్రమణం జరిగిన పిమ్మట, అనగా సూర్య భగవానుడు మేష రాశిలో ప్రవేశించిన పిమ్మట ప్రజల ఆరోగ్యాలను కాపాడే బాధ్యతను ఆయన స్వీకరిస్తాడు. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్’ సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించు వాడు. అప్పటి నుండే ఎండలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. మనుషులలో రోగనిరోధక శక్తి క్రమంగా పెరుగుతుంది. ఆయన క్రిమి కీటకాదులను సంహరిస్తాడు. మరియు కరోన వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. జూన్ చివరి వరకు ఇది సంపూర్ణంగా తగ్గిపోతుంది.

జ్యోతిష పరంగా ఉపశమనాలు:

వైద్యశాస్త్ర పరంగా ఏ వైరస్ కు అయినా కూడా మందు ఉండదు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం లేదా రోగం రాకుండా కాపాడే టీకా లు తీసుకోవడం.

జ్యోతిష శాస్త్రానికి ఆధారం కర్మ సిద్ధాంతం. మనిషి తన కర్మలను అనుసరించి ఫలాన్ని పొందుతూ ఉంటాడు. ఈ విధమైన యోగాలు లోకారిష్ట యోగాలు. లోకంలో పాప కర్మలు పెరిగిపోయిన నాడు ఈ విధమైన చిక్కులు ఎదురౌతూ ఉంటాయి. అందుకే మనిషి సదా సత్కర్మలనే ఆచరిస్తూ ఉండాలి. అప్పుడే లోక సంగ్రహము జరుగుతుంది. జ్యోతిషము ను అనుసరించి క్రింద వివరించ బడిన శాంతులు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి.

1. ప్రధానంగా, ప్రతి ఒక్కడు రోగ నిరోధక శక్తిని పెంపొందించు కోవాలి. తగిన విధంగా ఆహారము, వ్యాయామము మరియు యోగాభ్యాసము చేస్తూ ఉండాలి.

2. మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించు వాడు భాస్కరుడు. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచు వాడు సూర్యుడే. కావున శ్రీ సూర్యోపాసనలు శుభ ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా ఘృణి సూర్య మంత్రం జపం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఘృణి సూర్య మంత్రం ‘ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య ఓం’ అనే మంత్రాన్ని నిత్యం 108 సార్లు సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఉదయాన్నే జపం చేసుకోవాలి. ఈ మంత్రానికి ఉపదేశం అవసరం లేదు. ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణం చేసుకోవాలి. ‘అరుణ ప్రశ్న (తైత్తిరీయ ఆరణ్యక అరుణ ప్రశ్న) అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇవి వేద మంత్రాలు. దీని పారాయణ అందరూ చేయలేరు కావున అభ్యాసం గల వారు నిత్యం పారాయణం చేసుకొనుట లేదా పారాయణం వినుట. వినుట వలన కూడా ఫలితం లభిస్తుంది.

3. శ్రీ మహా విష్ణు ఆరాధనలు. ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షర మంత్రం లేదా ‘ఓమ్ నమో భగవతే వాసుదేవాయ’అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేసుకోవాలి. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పారాయణ చేయడం లేదా వినడం కూడా శ్రేయస్కరమే.

4. శ్రీ దేవి సప్తశతి పారాయణం అద్భుత ఫలితాలను ఇస్తుంది:

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।

భయేభ్యః స్త్రాహినో దేవి దుర్గే దేవీ నమోస్తుతే ।। (దేవీ మహాత్మ్యం ౧౧-౨౪)

సర్వ స్వరూపము, సర్వేశ్వరివి, సర్వ శక్తులతో కూడిన దానవు అయిన ఓ దేవి! దుర్గా! మమ్ము భయముల నుండి కాపాడుము. నీకు మా నమస్కారము.

ఓం రోగా నశేషా నపహంసి తుష్టా

రుష్టాతు కామాన్ సకలా నభీష్టాన్ ।

త్వా మాశ్రితానాం నవిపన్నరాణాం

త్వా మాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ।। (దేవీ మహాత్మ్యం ౧౧-౨౯)

ఓ దేవీ! నీవు తృప్తినొందిన ఎడల రోగము లన్నిటిని అపహరింతువు కోపించినచో కోరికల నన్నిటినీ కూలుతువు. నిన్ను ఆశ్రయించిన వారికి ఆపదలుండవు. అంతేకాదు వారు ఇతరులకు ఆశ్రయము ఇచ్చే వారగుదురు.

ఓం ఉపసర్గా నషేశాం స్తు, మహామారీ సముద్భవాన్ ।

తథా త్రివిధ ముత్పాతం, మహాత్మ్యం శమయేన్మమ ।। (దేవీ మహాత్మ్యం ౧౨-౮)

మహామారి (మహామారి అనగా అంటురోగాలు) వలన కలిగిన అశేష ఉపద్రవములను, భౌమ, అంతరిక్ష మరియు దివ్యములు అనెడి త్రివిధ ఉత్పాతములను నా మహాత్మ్యము శమింప చేయును.

ఇవి శ్రీ దేవి సప్తశతి లోని ప్రమాణాలు. కాలానుగుణంగా కలిగే వ్యాధుల నివారణకు మరియు మహామారి లాంటి ఉత్పాతాలకు శ్రీ దేవి మహాత్మ్యం లేదా శ్రీ దేవి సప్తశతి లేదా శ్రీ దుర్గా సప్తశతి పారాయణం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।

 గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు. ।। 

"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां- न्यायेन मार्गेण महीं महीशाः । 

गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं- लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి 

नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति