Astro Update - Rahu Ketu Transit

Rahu Ketu Gochara Phala

Vedic Astrology - Consulting - Planetary Transits - Rahu Ketu Transit  


ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శుభ గ్రహాః


మిథున రాశిలో రాహువు గోచార ఫలము


రాహువు 07.03.2019 ఉదయము గం. 10:57 లకు వక్రగతిలో మిథున రాశిలో ప్రవేశము.


రాహువు కేతువులు గ్రహాలు కావు. అవి ఛాయా గ్రహాలు. ఖగోళ శాస్త్రంలో గ్రహణాల సమయంలో మాత్రమే వీటి ప్రాధాన్యత కలదు. అత్యంత ప్రాచీన జ్యోతిష గ్రంథము లందు రాహువు కేతువులకు చెందిన సమాచారము తక్కువగా ఉన్నది. గత 3 దశాబ్దాలుగా ఈ రెండు గ్రహాల ప్రాచుర్యము చాలా పెరిగింది. ఇప్పటి జ్యోతిషులు లేదా జ్యోతిష సంబంధిత వృత్తిలో గల వారు జాతక చక్రమున గల అన్ని దోషాలను సర్ప దోషాలుగా అభివర్ణిస్తున్నారు. అది తప్పు. “కాల సర్ప దోషము” శీర్షికలో నేను రాహువు మరియు కేతువులు ఏర్పరచు దోషాల గూర్చి సవివరంగా వ్రాసాను.


గోచార రీత్యా రాహువు మరియు కేతువుల ప్రతికూల సంచారము జాతకులకు ఒక విధమైన అనిశ్చితిని ప్రసాదిస్తుంది. కేతువు రాహువులు అపసవ్యంలో భ చక్రంలో సంచరిస్తూ ఉంటాయి. ఇట్టి రాహువు మరియు కేతువుల గుణించు పద్దతులు రెండు విధాలుగా ఉన్నాయి. “నిజ గతి మరియు సగటు గతి” జ్యోతిషులు వారి అనుభవమును బట్టి ఈ రెండు పద్ధతులందు ఏదేని ఒక పద్ధతిని ఎన్నుకుంటారు. ప్రస్తుతము రాహువు కర్కాటక రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించనున్నాడు. సగటు గతి (Mean Motion) పద్ధతిన ఈ నెల అనగా మార్చ్ 7 నాడు మిథున రాశిలో ప్రవేశము. మిథున రాశిలో రాహువు ఈ వత్సరాంతం వరకు కూడా సంచరించును.

మిథునము లో రా రాహువు మరియు ధనుస్సు రాశిలో కేతువు గోచార ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి పైన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకొందాము:


మేషము:

సర్వ కార్యసిద్ధి, సజ్జన సాంగత్యము, ధన ప్రాప్తి ఆరోగ్యము, సుఖము. భాగ్య కేతువు వలన అధిక ధన వ్యయము, తలచిన పనులు కుంటుబడుట, అవకాశాలు చేజారిపోవుట. ఇట్టి గోచారమున శుభ ఫలాలు అధికంగా ఉండే సూచనలు.


వృషభము:

అకారణ కలహాలు, అధిక ధన వ్యయము, అనవసరం ఖర్చులు, వ్యసనములకు ధనాన్ని అధికముగా వెచ్చించుట, స్పెకులేషన్ లో నష్టాలు, దుర్బలత్యం, మిత్రులు సన్నిహితుల ద్వారా మోసగించ బడుట, తేజో క్షీణత, స్వల్ప అనారోగ్యము, అల్లర్జీల వలన చిక్కులు, కల్తీ ఆహారము వలన చిక్కులు, స్వల్ప ప్రమాదాలు, బంధు విరోధము, అవమానము, రాజదండన భయము మొ.


మిథునము:

ఇట్టి రాశి వారికి ప్రతికూల ఫలాలు అధికముగా ఉండే అవకాశము కలదు. మనోవ్యాకులత అధికం, అనుకోని ఒడుదుడుకులు, భాగస్వాములతో విభేదాలు, భాగస్వామ్య వ్యవహారాలందు చిక్కులు, భార్య లేదా భర్త తో కలహం, శతృ వృద్ధి, మానసిక ఒత్తిడులు అధికము, అవకాశాలు చేజారిపోవుట, కార్య విఘ్నము మొదలగు గా గల ప్రతికూల ఫలాలను సూచించును.


కర్కాటకము:

ప్రతికూల ఫలాలు అధికము. మిశ్రమ ఫలాలు స్వల్పము. అధిక ధన వ్యయము, అనుకోని ఖర్చులు, మోసాలు మరియు ఆర్ధిక లావాదేవీలందు మోసాలు, కోర్ట్ కేసు లందు చిక్కులు, రాజ దండన భయము, వృధా సంచారము, మానసిక చింత మరియు ఆందోళన, బంధు విరోధము. కాని ౬ వ స్థానమున సంచరించు కేతువు కొంత ఉపశమనమును ప్రసాదించు సూచనలున్నాయి. శ్రమతో కూడిన ఫలాలు పొందే అవకాశము ఉంది.


సింహము:

శుభ ఫలాలు అధికము మరియు ప్రతికూల మిశ్రమ ఫలాలు స్వల్పము. చక్కని కార్యానుకూలత, తలపెట్టిన పనులు విజయవంతమగుట, కాని పంచమ కేతువు వలన మానసిక చింత మాత్రము అధికముగానే ఉండే అవకాశముంది. సంతానాన్ని ఆశించే వారికి ప్రతికూల ఫలాలు అధికముగా ఉండే అవకాశము ఉంది. వృత్తి రీత్యా శుభ ఫలాలు అధికముగా ఉండే అవకాశముంది.


కన్య:

అనుకోని ఒడుదుడుకులు, ఉద్యోగ భంగ యోగాలు, అనుకోని స్థాన చలనము, ఆస్తుల పనులందు ఒడుదుడుకులు, కుటుంబ వ్యవహారము లందు వ్యాకులత, అభివృద్ధి పరమైన ఒడుదుడుకులు, మనో వ్యాకులత, యంత్ర సంబంధిత ప్రమాదాలు, దుష్టులతో సహవాసము, శారీరిక శ్రమ, కార్య విఘ్నము, అనారోగ్యము మొ.


తుల:

భాగ్య స్థానమున రాహువు సంచారము కొన్ని అత్యంత ప్రధానమైన అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవుట, పితృ సంబంధమైన ప్రతికూలతలు, తేజో క్షీణత, పాప కర్మ లందు ఆసక్తిని కనబరచుట, ఆరోగ్య క్షీణత మొదలగు ప్రతికూలతలు ఉన్నను తృతీయ స్థానమున కేతువు కొంత ఉపశమనాన్ని ప్రసాదించే సూచనలున్నాయి.


వృశ్చికం:

వృశ్చిక రాశి వారికి ప్రతికూల ఫలాలు అధికముగా ఉండే సూచనలున్నాయి. వీరికి అనారోగ్యము, స్వల్ప ప్రమాదాలు, తేజో క్షీణత, ప్రమాదాలు, అనుకోని లేదా ఊహించని అనారోగ్య పరమైన చిక్కులు, ఆర్ధిక లావాదేవీలందు చిక్కులు, రాజ దండన భయం, మోసాలు, సన్నిహితుల ద్వారా మోసగింపబడుట, నేత్ర సంబంధమైన చిక్కులు, వృత్తి పరమైన ప్రతికూలతలు మొదలగు ప్రతికూల ఫలములను పొందు సూచనలున్నాయి


ధనుస్సు:

ఇట్టి రాశి వారికి ప్రతికూల ఫలాలు అధికముగా ఉండే అవకాశము కలదు. మనోవ్యాకులత అధికం, అనుకోని ఒడుదుడుకులు, భాగస్వాములతో విభేదాలు, భాగస్వామ్య వ్యవహారాలందు చిక్కులు, భార్య మరియు భర్త తో కలహం, శతృ వృద్ధి, మానసిక ఒత్తిడులు అధికము, అవకాశాలు చేజారిపోవుట, కార్య విఘ్నము మొదలగు గా గల ప్రతికూల ఫలాలను సూచించును.


మకరము:

శుభ ఫలాలు అధికముగాను మరియు ప్రతికూల ఫలాలు స్వల్పముగాను ఉండే సూచనలున్నాయి. కార్య విజయము, శతృవులు మరియు పోటీదారులపైన విజయము, సర్వత్రా శుభ ఫలాలు అధికము, వృత్తి రీత్యా చక్కని అభివృద్ధి, పదోన్నతులు, చక్కని ఆర్థికాభివృద్ధి మొదలగు గా గల శుభ ఫలములు అధికముగా ఉండు సూచనలున్నాయి. కాని వ్యయ స్థానమున కేతువు వలన వీరు వ్యవహారికముగా జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప వివాదాలను కూడా ఎదుర్కునే అవకాశమున్నది.


కుంభము:

ఇట్టి రాశిలో జన్మించిన వారికీ శుభ ఫలములు స్వల్పము గాను మరియు ప్రతికూల ఫలములు అధికముగాను ఉండే సూచనలున్నాయి. వీరిలో మానసిక చింత అధికమగు సూచనలున్నాయి. వీరు మానసిక ఒత్తిడులను అధికముగా ఎదుర్కోను వారాగు సూచనలున్నాయి. వీరు తొందరపాటు నిర్ణయాలకు దూరముగా ఉండాలి. అనారోగ్యము, అధిక రక్తపోటు, జీర్ణాశయం మరియు శ్వాస కోశానికి చెందిన చిక్కులు. సంతాన పరముగా మనోవేదన, అధిక ధన వ్యయము, పాప కార్యాసక్తి. కాని లాభ స్థానమున ఉన్న కేతువు కొంత ఉపశమనమును ప్రసాదించుట మరియు ఇట్టి ప్రతికూలతలను తగ్గించే అవకాశము కలదు.


మీనము:

అనుకోని ఒడుదుడుకులు, ఉద్యోగ భంగ యోగాలు, అనుకోని స్థాన చలనము, ఆస్తుల పనులందు ఒడుదుడుకులు, కుటుంబ వ్యవహారము లందు వ్యాకులత, అభివృద్ధి పరమైన ఒడుదుడుకులు, మనో వ్యాకులత, యంత్ర సంబంధిత ప్రమాదాలు, దుష్టులతో సహవాసము, శారీరిక శ్రమ, కార్య విఘ్నము, అనారోగ్యము మొ.


ముఖ్య గమనిక:

పైన వివరించిన గోచార ఫలాలు సాధారణ ఫలాలు మాత్రమే. ఇట్టి గోచర ఫలాలను మీ జాతక చక్రమున ఉన్న శుభాశుభ గ్రహ యోగాలు మరియు జన్మకాల దశలు ప్రభావితము చేయుట వలన పైన వివరించ బడిన శుభాశుభ ఫలితము లందు మార్పులు సంభవించే అవకాశం ఉంది. మీ జాతకాలకు అనుగుణంగా మరియు నక్షత్రాలకు అనుగుణంగా ఉండే అనుకూల లేదా ప్రతికూల గోచారము గూర్చి తెలుసుకోవాలనుకుంటే సంప్రదించండి. పైన వివరించ బడిన ఫలితాలను అత్యంత జాగ్రత్తగా అన్వయించు కోవాలి.


Important Note: 

The above-mentioned results are generalized results only. The Planetary position and Yogas present in the Janma Kundli and the Janma Kaala Dasha will influence these Gochara Results, due to which the said results may or may not become fruitful. Please contact me if you want to know about an auspicious or inauspicious result for your Rasi. All the above said results should be used with a great caution.


"సర్వేజనాః సుఖినో భవంతు - లోకాః సమస్తా సుఖినో భవంతు"


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

Namilikonda Vishweshwar Sarma

नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति

Rahu Ketu Gochara

These are the Transitory Results for Rahu and Ketu in Mithuna Rasi. The Results are being published in Telugu. English all will be uploaded soon.