Sri Gayatri Veda Vision (Vedic Astrology & Research)

Home Page

Sri Gayatri Veda Vision (Vedic Astrology & Research), Birth Chart, Detailed Horoscope in English and Telugu Languages, Various Queries, Astrology Allied Products, Saturn in Capricorn Etc.

  

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః


మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ‘దీపాన్ని వెలిగించండి – కరోన పారదోలండి’

పిలుపు వెనుక ఉన్న శాస్త్ర మర్మం


ప్రపంచమంతా కూడా కరోన వైరస్ ప్రభావంతో విలవిలలాడి పోతుంది. అసలు దాన్ని ఏవిధంగా నియంత్రించాలో కూడా దేశాధినేతలకు తెలియడం లేదు. ఒకరికొకరు భౌతిక దూరాన్ని పాటించడమే గొప్ప మార్గంగా భావిస్తున్నారు. అది పాటించిన దేశాలలో కొంతవరకు కరోన ను నియంత్రించ గలుగుతున్నారు. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు చక్కటి ముందు చూపుతో భారతదేశమంతా కూడా లాక్ డౌన్ విధించి కట్టడి చేసారు. వారి ముందు చూపు ప్రశంసనీయం. ‘మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం, ఆర్థికాభివృద్ధి కాదు’ అని చాటించేసారు. అసలు మనిషి జీవించి ఉంటేనే కదా ఏదైనా సాధన. ఏ సాధన చేయాలన్నా, ఏ కర్మను ఆచరించాలన్నా కూడా మనిషి కావాల్సిందల్లా ఆరోగ్యవంతమైన శరీరం. దేశమంతా రోగులతో నిండిపోయి ఉంటే, రోగాలతో నిండిపోయి ఉంటే ఆర్థికాభివృద్ధి కి కృషి చేసేదెవరు?


మన ప్రధానమంత్రి శ్రీ మోడి గారు ‘దీపాన్ని వెలిగించండి – కరోన పారదోలండి’ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఏప్రిల్ 5 వ తేది నాడు రాత్రి 9 గంటలకు ఒక 9 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి నూనె దీపాన్ని గాని లేదా మొబైల్ ఫ్లాష్ ను గాని లేదా క్రొవ్వొత్తి దీపాన్ని గాని వెలిగించండి అని ప్రజలందరినీ కోరారు. ఈ ప్రకటన గూర్చి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడు కుంటున్నారు. ఇక విమర్శకులకైతే అంతే లేదు. ప్రతి విషయాన్ని విమర్శించడం, విభేదించడం వారి జన్మ హక్కు. ‘దీపాన్ని వెలిగించండి – కరోన పారదోలండి’ వెనక గల రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాము. అసలు ఇది ఎంతవరకు ప్రయోజనకర మైనదో చూద్దాము. ఇట్టి విశ్లేషణలో ఏ విధమైన మూఢ నమ్మకం గాని ఛాందసం గాని ఉండదు:


1. అన్నిటికంటే ముఖ్యమైనది లేదా ప్రధానమైనది: మనలో గల అజ్ఞానమనే చీకటిని పారదోలండి. జ్ఞాన జ్యోతిని వెలిగించండి. మరి లైట్లు ఆర్పడం ఎందుకు? మనిషి ధ్యానం చేసుకోవడానికి గాను అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ధ్యాన సమయంలో చుట్టుపక్కల గల ప్రతి వస్తువు మన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే ధ్యాన కేంద్రాలలో ఎదురుగా ఒక ‘ఓం’ ఉండి చిన్న దీపం వెలుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల చీకటి గాని లేదా అతి తక్కువ వెలుతురూ గాని ఉండే విధంగా చేస్తారు. శ్రీ రామకృష్ణ మఠం సందర్శకులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అట్టి స్థితిలో సాధకుడి దీక్ష భగ్నం కాకుండా ఉంటుంది. సాధన యొక్క ప్రాథమిక దశలో ఉన్న వారికి అది అత్యంత ప్రధానమైనది. ఈ విధమైన వాతావరణాన్ని సృష్టించి ధ్యాన ముద్ర ద్వారా పరమాత్ముడిని ప్రార్థించు ప్రక్రియ. ఈ ప్రక్రియ యోగాభ్యాసము చేసేవారు ప్రతి నిత్యం చేస్తూనే ఉంటారు. కాని సామూహిక ప్రార్థనకు, సామూహిక సాధనకు ఇది ఒక పిలుపు. సామూహిక ప్రార్థనలకు చాల శక్తి ఉంటుంది. దైత్యుల ద్వారా మానవులు కష్టపడ్డ ప్రతిసారి మనుషులందరూ కలిసి భగవానుడిని ప్రార్థించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో ప్రపంచంలో ప్రతి ఒక్కడూ కష్టపడుతున్నాడు. కావున అందరు కలిసి సామూహికంగా ప్రార్థించడం, భగవానుని వేడుకోవడం చాల అవసరం. సామూహిక హోమాలు, సామూహిక పూజలు బయట చేసుకునే సమయం కాదిది. కావున ఎవరి ఇంట్లో వారు ఈ విధమైన దీక్షను కలిసికట్టుగా సామూహికంగా చేపట్టడానికి మోడీ గారు ఇచ్చిన పిలుపు ఇది. 


2. రెండవది: మన హిందూ ముహూర్త మరియు ధర్మ శస్త్ర గ్రంథా లందు ‘ప్రదోష పూజ’ కు చాల ప్రాధాన్యత కలదు. ‘ప్రదోష’అనగా పాపము, లేదా చెడు. మనలో గల పాపాన్ని లేదా చెడును పారదోలుటకు గాను ప్రదోష సమయంలో శ్రీ శివార్చన చాలా విశేషమైనది. ఏప్రిల్ 5, రాత్రి 9 గంటల సమయం. చైత్ర శుద్ధ త్రయోదశి (అధిపతి సర్వమంగళ). సూర్యాస్తమయ సమయంలో త్రయోదశి తిథి వలన ప్రదోష పూజలకు అనుకూలం. త్రయోదశి నాడు ఏర్పడిన ప్రదోషానికి ‘మహా ప్రదోషం’ అని పేరు. సూర్యోదయ వశాత్ 60 ఘడియల లోపు లేదా సూర్యాస్తమయ సమయంలో కనీసం ఒక ఘడియ త్రయోదశి ఉన్న ఎడల అది ‘మహా ప్రదోషం’ అని పిలువ బడుతుంది. ఇది శివారాధనలకు అత్యంత విశిష్టమైనది. ఆదివారంతో కలిసి రావడం వలన ‘అర్క ప్రదోషం’. మహా ప్రదోషం తో కూడిన అర్క ప్రదోషం అనారోగ్య పరమైన మరియు అపమృత్యు సంబంధమైన శివారాధనలకు అత్యంత విశిష్టమైనది. అందులోకి రాత్రి 9 గంటలకు సూర్య హోర. నేను 9 అనే అంకెకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సమయానికి, తిథికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాను. కావున ఇట్టి సమయంలో శ్రీ శివారాధన, ఇష్ట దేవత యొక్క ఆరాధన అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. అన్య మతాల వారు కూడా వారి మతానికి చెందిన దేవతారాధనకు ఇది అత్యంత అనుకూల సమయంగా పరిగణించ వచ్చు. కావున ప్రదోష పూజకు సిద్ధం కావాలి. ఇట్టి ప్రదోష పూజ సామూహికంగా చేయాలి, అనగా అందరూ కలిసి ఎవరి ఇంట్లో వారు ఉండి మరీ చేయాలి. మన రోదన, ఆర్తి భగవానుడు వినాలి. ఇది కుల మత జాతి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సింది.


3. ‘పురానా ఘృత్’ పురానా అనగా అత్యంత పురాతనమైనది, పాతది. ఘృతము అనగా నెయ్యి. వేదాంగ మైన ఆయుర్వేదం లో దీని కి చాలా ప్రాధాన్యత కలదు. శ్రేష్టమైన ఆవు నెయ్యిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక సంవత్సర కాలం పాటు బిగుతైన మూత గల సీసాలో ఉంటే అది ‘పురానా ఘృత్’ అని భావ ప్రకాశం లో కలదు. కాని చరక సంహిత ప్రకారం 10 సంవత్సరాలు బిగుతుగా ఉన్న మూత గల సీసాలో ఉంచిన నెయ్యిని ‘పురానా ఘృత్’ అని అంటారు. ఇది మనం ఇప్పటికిప్పుడు ఇంట్లో తయారు చేయడం కష్టం కావున బైద్యనాథ్ మరియు మరికొన్ని ఆయుర్వేద ఔషధాలను తయారుచేసే వారు దీన్ని అమ్ముతారు. ఇట్టి ఆవునెయ్యి ఎంత పాతది అయితే అంతటి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. 100 సంవత్సరాల పాతదైన ఆవు నెయ్యి కి అన్ని విధములైన రోగాలను నయం చేసే శక్తి ఉంటుందని భావ ప్రకాశం తెలియ జేయు చున్నది. ఈ విధమైన అనగా ‘పురానా ఘృత్’ తో గాని లేదా ఇంట్లో గల ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించి, కృత్రిమ విద్యుత్ కాంతి లేకుండా చేసి అట్టి దీపాన్ని ఒక ఘడియ పాటు దీక్షగా చూస్తూ శ్రీ సూర్య భగవానుడిని ధ్యానం చేయుట, ధన్వంతరి ని ధ్యానం చేయుట, లేదా మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేయుట ద్వారా పలు విధములైన నేత్ర సంబంధిత మరియు శ్వాస కోశ సంబంధిత రోగాలను చక్కగా అరికట్టవచ్చును. ‘కరోన వైరస్’ ఈ రెండు అంగాల ద్వారా ముందుగా మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. అది ముందుగా శ్వాసకోశ వ్యవస్థను స్తంబింప చేస్తుంది. కావున ఇట్టి దీపాలను ఆవునెయ్యి తో వెలిగించడం చాలా శ్రేష్టమైనది. కొందరు వివిధ నూనెల గూర్చి చెప్పు చున్నారు. కాని ఇట్టి సూచనలు వారి అనుభవానికి మాత్రమే వదిలివేయు చున్నను. వారి సూచనలకు శాస్త్ర ప్రమాణాలు దొరకక పోవచ్చు కాని పాత ఆవు నెయ్యికి మాత్రం చాలా ప్రమాణాలు లభిస్తాయి. దీన్ని కూడా కులమత జాతి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ సులువుగా ఆచరించ వచ్చు.


4. దీనికి గ్రహ సంబంధ మైన, సాంఖ్యా శాస్త్ర సంబంధమైన మరియు ఖగోళ శాస్త్ర సంబంధమైన దాన్ని అంటగడుతున్నారు. ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని వత్తులు వేయాలి ఇత్యాది వాటిని అనువర్తించు చున్నారు. దయచేసి అనవసరమైన మూఢనమ్మకాలను నమ్మ వద్దు. ఇది ఒక సామూహిక ప్రార్థన లాంటిదే అని గ్రహించండి. ‘మేమంతా కలిసి కట్టుగా పోరాడుతున్నామని’ తెలపడానికి చేసే ప్రయత్నం మాత్రమే అని గ్రహించాలి. హిందువులకు నూనె దీపాలు,ఇతర మతాల వారికి కొవ్వొత్తి దీపాలు మరియు మొబైల్ ఫ్లాష్ లు. ఇందులో వివాదమే లేదు.

కావున ప్రతి ఒక్కరూ యథాశక్తి ఈ సాధనలో పాల్గొనాలి. అనవసరం వివాదం కూడా వద్దు.


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు. ।।
 

"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां- न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं- लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति

image52

Services

image53

Astrological Services

Astrological Services

Astrological Services

All kinds of Vedic Astrology Consulting, Horoscope, Varshaphal, Marriage Matching, Analysis for Profession, Finances, Assets, Health, Education, Marriage and Marital Life, Timing of the Events, Foreign Travel Yogas Etc.

image54

Muhurat & Query

Astrological Services

Astrological Services

All Kinds of Muhurat and Query (Prashna) regarding: Education, Finances, Assets, Court Cases and Disputes, Health, Profession, Business, Investments, Profits and Losses, Marriage and Marital Life, Children, Foreign Travel Etc.

image55

Allied Products

Astrological Services

Allied Products

All Astrology Allied Products. Various Kinds of Yantras - Matsya Yantra, Kurma Yantra, Maha Lakshmi Yantra, Nara Drushti Nivaran Yantra, Sri Yantra, Sri Yantra (Meru in Pancha Loha), all Graha Yantras and other Puja and Abhishek Material

(These services are shortly going to be available)

Subscribe

Sign up to hear from us.